Rajinikanth's tweet: ఇండోర్‌ గేమ్స్‌లో చెస్‌ అంటే ఇష్టం

ABN , First Publish Date - 2022-07-29T12:58:46+05:30 IST

నగర శివారు ప్రాంతంలోని మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీనిని పురస్కరించుకుని

Rajinikanth's tweet: ఇండోర్‌ గేమ్స్‌లో చెస్‌ అంటే ఇష్టం

అడయార్‌(చెన్నై), జూలై 28: నగర శివారు ప్రాంతంలోని మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీనిని పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఓ ట్వీట్‌ చేశారు. ‘తనకు ఇండోర్‌ గేమ్స్‌లో బాగా ఇష్టమైనది చదరంగం(chess) అని వెల్లడించారు. పైగా, ఈ ఒలంపియాడ్‌(Olympiad) పోటీల్లో పాలుపంచుకుంటున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తాను గతంలో చెస్‌ ఆడుతున్న ఫొటో కూడా షేర్‌ చేయడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.

Read more