Actress Khushboo: జాతీయ జెండాలతో 75 కార్ల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-07T15:17:02+05:30 IST

స్వాతంత్య్ర 75వ దినోత్సవ వేడుకల్లో భాగంగా సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) సారథ్యంలోని 75 కార్లతో ప్రదర్శన జరిగింది. ఈ కార్ల ముందు

Actress Khushboo: జాతీయ జెండాలతో 75 కార్ల ప్రదర్శన

అడయార్‌(చెన్నై), ఆగస్టు 6: స్వాతంత్య్ర 75వ దినోత్సవ వేడుకల్లో భాగంగా సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) సారథ్యంలోని 75 కార్లతో ప్రదర్శన జరిగింది. ఈ కార్ల ముందు భాగంగా జాతీయ జెండాలను కట్టుకుని మహిళలే డ్రైవింగ్‌(Driving) చేసుకుంటూ ఈ కార్ల ర్యాలీ జరిగింది. దీన్ని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ ప్రారంభించగా, ఇది మధ్య కైలాష్‌, ఈసీఆర్‌ మీదుగా తిరువిడందై వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 13 నుంచి 15వ తేదీరకు ప్రతి ఒక్కరి ఇళ్ళపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. 



Read more