xi jinping suspense continuous: మళ్లీ మొదటికొచ్చిన జిన్‌పింగ్ వ్యవహారం.. చైనా మీడియా ఫొటోలపై అనుమానం!

ABN , First Publish Date - 2022-09-29T22:48:55+05:30 IST

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping) హౌస్ అరెస్ట్ (house arrest) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.

xi jinping suspense continuous: మళ్లీ మొదటికొచ్చిన జిన్‌పింగ్ వ్యవహారం.. చైనా మీడియా ఫొటోలపై అనుమానం!

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping) హౌస్ అరెస్ట్ (house arrest) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. జిన్‌పింగ్‌‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిందని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (People’s Liberation Army) పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి ఆయన్ను తొలగించి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్  లి కియోమింగ్‌ (General Li Qiaoming)ను చైనా అధ్యక్షుడిగా చేశారంటూ సోషల్ మీడియా(social media) లో పోస్టులు వైరల్ అవడాన్ని ఖండిస్తూ చైనా అధికారిక మీడియా విడుదల చేసిన ఫొటోలు, దృశ్యాలపై తాజాగా అనుమానాలు మొదలయ్యాయి. 


బీజింగ్‌లో జరిగిన ఒక ప్రదర్శనకు జిన్‌పింగ్‌ మాస్క్‌ ధరించి ప్రత్యక్షంగా హాజరై తిలకించారని ప్రభుత్వ అధికారిక మీడియా కొన్ని ఫొటోలను, దృశ్యాలను విడుదల చేసింది. ఈ ఫొటోలు, దృశ్యాలపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 


చైనా అధికారిక మీడియా విడుదల చేసిన తాజా ఫొటోలో జిన్‌పింగ్ కుడి చెవి పూర్తిగా వేరుగా ఉందని, అలాగే ఆయన గొంతుకు గతంలో మాదిరిగా డబల్ చిన్ కనపడటం లేదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిన్‌పింగ్ వయసు 70 ఏళ్లు కాగా చైనా మీడియా విడుదల చేసిన దృశ్యాల్లో పదేళ్లు తక్కువ వయసున్న వ్యక్తి మాదిరిగా కనిపిస్తున్నారని పోల్చి చెబుతున్నారు. ఎగ్జిబిషన్‌‌కు హాజరైనది ఒరిజినల్ జిన్‌పింగ్ కాదని, ఆయన డూప్ అని అనుమానిస్తున్నారు.  


బీజింగ్‌లో ప్రస్తుతం ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని, ఉక్కపోతగా ఉన్న సమయంలో డబుల్ జాకెట్ ఎలా ధరిస్తారని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధికారిక మీడియా పాత దృశ్యాలను, ఫొటోలను విడుదల చేసి నమ్మించాలని చూస్తోందని నిపుణులంటున్నారు. 


గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ డూప్‌లను ఉపయోగించేవారని, ప్రస్తుతం జిన్‌పింగ్ విషయంలో అదే విధంగా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. జిన్‌పింగ్ డూప్‌తో పుకార్లకు చెక్ పెట్టాలని చైనా అధికారిక మీడియా యత్నిస్తోందని నిపుణులు అనుమానిస్తున్నారు. 


2020లో ప్రపంచంపై కొవిడ్‌ విరుచుకుపడినప్పటి నుంచీ దేశాన్ని వీడని జిన్‌పింగ్‌, సెప్టెంబర్ 16న ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాల్లో పాల్గొన్నారు. బీజింగ్‌కు తిరిగి వచ్చాక జిన్‌పింగ్ మళ్లీ బయటకి రాకపోవడంతో గృహనిర్బంధం వార్తలు గుప్పుమన్నాయి. త్వరలో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉందని, ఇంతలోనే ఆయనపై తిరుగుబాటు, హౌస్ అరెస్ట్ లాంటి కథనాలు బయటకు వస్తున్నాయి. మరోవైపు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (Chinese Communist Party) కానీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్‌ఏ కానీ ఈ పుకార్లను ఖండించలేదు. అయితే పుకార్లకు చెక్ పెట్టేందుకు చైనా అధికారిక మీడియా విడుదల చేసిన జిన్‌పింగ్ దృశ్యాలు, ఫొటోలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. కరచాలనం కూడా చేయలేదు. కేవలం గ్రూప్ ఫొటో మాత్రం దిగారు. అయితే ఆ గ్రూప్‌ ఫొటోలో అతి సమీపంలోనే ఉన్నా జిన్‌పింగ్ మోదీ మాట్లాడలేదు. సమావేశాల్లోని మిగతా సందర్భాల్లోనూ మోదీ ఆయనకు అతి సమీపంగా ఉన్నా మాట్లాడలేదు. 


2020 జూన్‌ 15న గల్వాన్ లోయ (galwan valley)లో చైనా సైన్యం కుట్రపూరితంగా చేసిన దాడిలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు చనిపోయారు. భారత సైన్యం నాడు జరిపిన ప్రతిదాడుల్లో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. అయితే ఎంతమంది చనిపోయారనేది చైనా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. గల్వాన్ ఘటన జరిగిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను ఆపివేసింది. నాటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా సైన్యాల మధ్య చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే చైనా తీరులో భారత్ కోరుకున్న మార్పు రాకపోవడంతో మోదీ జిన్‌పింగ్‌తో మాట్లాడలేదని తెలుస్తోంది. షాంఘై సహకార సంఘం సమావేశాల సందర్భంగా మోదీ జిన్‌పింగ్‌ను పట్టించుకోకపోవడం కలకలం రేపింది. ఇంతలో చైనా నుంచి వస్తోన్న పుకార్లు దుమారం రేపుతున్నాయి.   

Updated Date - 2022-09-29T22:48:55+05:30 IST