Donkeys and Dogs : పాక్ నుంచి గాడిదలు, కుక్కల దిగుమతి... లొట్టలేసుకుంటున్న చైనీయులు...

ABN , First Publish Date - 2022-10-05T01:21:17+05:30 IST

తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం

Donkeys and Dogs : పాక్ నుంచి గాడిదలు, కుక్కల దిగుమతి... లొట్టలేసుకుంటున్న చైనీయులు...

ఇస్లామాబాద్ : తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. గాడిదలు, కుక్కలను చైనాకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. వీటిని దిగుమతి చేసుకోవడానికి చైనా కూడా ఆసక్తి చూపుతోంది. ఈ వివరాలను పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీకి ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 


సెనేట్ స్టాండింగ్ కమిటీ సభ్యులతో సోమవారం జరిగిన సమావేశంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ, గాడిదలు, కుక్క (Donkeys and Dogs)లను దిగుమతి చేసుకోవడానికి చైనా ఆసక్తి చూపుతోందని తెలిపారు. సెనేటర్ అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ, మాంసం దిగుమతి గురించి కూడా చైనా రాయబారి చాలాసార్లు ప్రస్తావించారని చెప్పారు. మరో సభ్యుడు మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో పశువుల ధర తక్కువగా ఉంటుందని, అక్కడి నుంచి దిగుమతి చేసుకుని, వాటి మాంసాన్ని చైనాకు ఎగుమతి చేయవచ్చునని అన్నారు. 


చైనా సంప్రదాయ ఔషధాల తయారీలో గాడిదలు ఉపయోగపడతాయి. వాటి చర్మం నుంచి డంకీ హైడ్ జిలాటిన్‌ను తీసి ఉపయోగిస్తారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 57 లక్షల గాడిదలు ఉన్నట్లు అంచనా. గాడిదలు అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్ మూడోది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో గత సంవత్సరం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం డంకీ ఫార్మ్‌ను ఏర్పాటు చేసింది. ఒకారా జిల్లాలో సుమారు 3,000 ఎకరాల విస్తీర్ణంలో గాడిదలను పెంచుతోంది. 


Updated Date - 2022-10-05T01:21:17+05:30 IST