Chief Minister: ఏడాదిలో 8,649 కి.మీ ప్రయాణం

ABN , First Publish Date - 2022-12-30T10:20:27+05:30 IST

రాష్ట్రంలో ఏడాది కాలంలో 8,649 కి.మీ ప్రయాణించడంతో పాటు 647 కార్యక్రమాల్లో పాల్గొన్నానని

Chief Minister: ఏడాదిలో 8,649 కి.మీ ప్రయాణం

- సీఎం స్టాలిన్‌

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 29: రాష్ట్రంలో ఏడాది కాలంలో 8,649 కి.మీ ప్రయాణించడంతో పాటు 647 కార్యక్రమాల్లో పాల్గొన్నానని సీఎం స్టాలిన్‌ తెలిపారు. తిరుచ్చిలో గురువారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రూ.3 వేల కోట్ల విలువైన సహాయాలు, పథకాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ ఏడాదిలో 549 ప్రభుత్వ కార్యక్రమాలు, 96 పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, అదేవిధంగా కోటి 74 లక్షల 355 మంది లబ్దిదారులకు సంక్షేమ సహాయాలు అందజేసినట్లు సీఎం తెలిపారు.

ఉదయనిధి చక్కగా పనిచేస్తారనే నమ్మకం...

కార్యక్రమంలో తొలిసారిగా మంత్రి హోదాలో ఉదయనిధి(Udayanidhi) పాల్గొన్నారని, ఆయన అందరికీ సుపరిచితుడేనని సీఎం అన్నారు. ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వడంపై పలువురు ఆక్షేపణ తెలిపారని, వారికి తన పనితీరుతోనే ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఆయన తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తారనే నమ్మకం ఉన్నట్లు సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-30T10:20:31+05:30 IST