చెస్‌ ఒలంపియాడ్‌పై ప్రచారం

ABN , First Publish Date - 2022-07-22T15:53:57+05:30 IST

మహాబలిపురంలో ఈ నెల 28న ప్రారంభం కానున్న 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా

చెస్‌ ఒలంపియాడ్‌పై ప్రచారం

పెరంబూర్‌(చెన్నై), జూలై 21: మహాబలిపురంలో ఈ నెల 28న ప్రారంభం కానున్న 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా తిరువణ్ణామలై ఈశాన్య మైదానంలో తమిళనాడు ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ (మహిళా పథకం) ఆధ్వర్యంలో గురువారం రంగవల్లికలతో భారీ చెస్‌ బోర్డు నమూనా రూపొందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మురుగేశ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.ప్రియదర్శిని, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ అధికారి న్యాన్సీ సహా పలుశాఖల అధికారులు, మహిళా బృందాల సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more