ఒలంపియాడ్‌ ప్రాంగణంలో కేంద్ర కార్యదర్శి పరిశీలన

ABN , First Publish Date - 2022-07-22T16:16:37+05:30 IST

చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న 44వ చెస్‌ ఒలంపియాడ్‌ క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఉదయం కేంద్ర ప్రభుత్వ యువజన

ఒలంపియాడ్‌ ప్రాంగణంలో కేంద్ర కార్యదర్శి పరిశీలన

ప్యారీస్‌(చెన్నై), జూలై 21: చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న 44వ చెస్‌ ఒలంపియాడ్‌ క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఉదయం కేంద్ర ప్రభుత్వ యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల కార్యదర్శి సుజాతా చతుర్వేది పరిశీలించారు. ఆ ప్రాంగణంలో కల్పించిన వసతులు, క్రీడావేదికలు, వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలు, క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన డైనింగ్‌ హాలు, చెస్‌బోర్డులు తదితర ఏర్పాట్లను స్థానిక అధికారులతో ఆమె పరిశీలించారు.

Read more