Chess competitions: 26న రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

ABN , First Publish Date - 2022-11-18T10:43:10+05:30 IST

సవిత లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, బ్రెయిన్‌ బిహైండ్‌ చెస్‌(Chess) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు(Chess competitions)

Chess competitions: 26న రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు

ఐసిఎఫ్‌(చెన్నై), నవంబరు 17: సవిత లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, బ్రెయిన్‌ బిహైండ్‌ చెస్‌(Chess) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలు(Chess competitions) జరుగనున్నాయి. స్థానిక తండలం సవిత నగర్‌లో ఉన్న సిమెట్స్‌ నల్లి ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 8,10,12,15 ఏళ్లలోపున్న వారు పాల్గొనవచ్చు. గెలుపొందే వారికి మొదటి బహుమతిగా రూ.5 వేలు, రెండవ బహుమతి రూ.2,500, మూడవ బహుమతి రూ.2 వేలు అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదిలోపు 7667006464 అనే నెంబరు సంప్రదించి పేరు నమోదుచేసుకోవచ్చు.

Updated Date - 2022-11-18T10:43:12+05:30 IST