Trains: చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ మధ్య రైళ్ల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-08-06T15:10:57+05:30 IST

చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌(Chennai Central - Shalimar) మధ్య వీక్లీ ఎక్స్‌ప్రె్‌సలను పునరుద్ధరించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ వివరాలిలా...

Trains: చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌ మధ్య రైళ్ల పునరుద్ధరణ

చెన్నై, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): చెన్నై సెంట్రల్‌ - షాలిమార్‌(Chennai Central - Shalimar) మధ్య వీక్లీ ఎక్స్‌ప్రె్‌సలను పునరుద్ధరించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ వివరాలిలా... షాలిమార్‌ - చెన్నై సెంట్రల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22825) ఈ నెల 9 నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (22826) ఈ నెల 10వ తేదీ నుంచి ప్రతి బుధవారం రాత్రి 7.55 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు షాలిమార్‌ చేరుకుంటుంది. 2 ఏసీ టూ టైర్‌, 2 ఏసీ త్రీ టైర్‌, 10 స్లీపర్‌ బోగీలు, 2 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు, 2 సెకండ్‌ క్లాస్‌ కం లగేజ్‌ బోగీలున్న ఈ రైళ్లు సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్‌ జంక్షన్‌, జలేశ్వర్‌, బాలాసోర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌ కె.రోడ్‌, కటక్‌, భువనేశ్వర్‌, ఖుర్దారోడ్‌, బరంపురం, పలాస, విజయనగరం(Vizianagaram), విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట స్లేషన్లలో ఆగుతాయి. 

Updated Date - 2022-08-06T15:10:57+05:30 IST