Cheetah: పట్టపగలే చిరుత సంచారం

ABN , First Publish Date - 2022-09-03T16:25:24+05:30 IST

సండూరు నుంచి ఎన్‌ఎండీసీ వెళ్లే అటవీ మార్గంలో పట్టపగలే చిరుత(cheetah) సంచరిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఆందోళన

Cheetah: పట్టపగలే చిరుత సంచారం

బళ్లారి(బెంగళూరు), సెప్టెంబరు 2: సండూరు నుంచి ఎన్‌ఎండీసీ వెళ్లే అటవీ మార్గంలో పట్టపగలే చిరుత(cheetah) సంచరిస్తుండడంతో వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రహదారిపై చిరుత కనిపించడంతో అటువైపు వెళ్లాలంటే స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఎన్‌ఎండీసీ(NMDC) చుట్టు పక్కల ప్రాంతంలో ఇనుపగనుల తవ్వకాలు తగ్గడంతో చిరుత సంచారం పెరుగుతున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాల కారణంగా సండూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా కొండలు విస్తరించి ఉండడంతో అటవీప్రాంతాలు పచ్చదనంతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దీంతో ఈ అందాలను తిలకించేందుకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటి సమయంలో పట్టపగలే రోడ్ల మధ్య చిరుతలు తిరుగుతుండడంతో పర్యాటకులు భయపడుతున్నారు. 

Read more