Chandigarh University issue: ఛండీగర్ యూనివర్సిటీ విద్యార్థినుల స్నానాల వీడియోల కేసులో తాజా అప్‌డేట్ ఇది..

ABN , First Publish Date - 2022-09-20T05:04:15+05:30 IST

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఛండీగర్ యూనివర్సిటీ విద్యార్థినుల స్నానాల వీడియోల కేసుకు సంబంధించి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఏడు రోజుల రిమాండ్‌కు..

Chandigarh University issue: ఛండీగర్ యూనివర్సిటీ విద్యార్థినుల స్నానాల వీడియోల కేసులో తాజా అప్‌డేట్ ఇది..

ఛండీగర్: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఛండీగర్ యూనివర్సిటీ విద్యార్థినుల స్నానాల వీడియోల కేసుకు సంబంధించి తాజా అప్‌డేట్ ఏంటంటే.. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి ఏడు రోజుల రిమాండ్‌కు తరలించారు. వారి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపించారు. ఆ ఫోన్లలో రెండు వీడియోలు ఉన్నట్లు తెలిసింది. ఆ వీడియోల్లో ఒకటి ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి వీడియో కాగా, మరొక యువతి కూడా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి తరపున వాదనలు వినిపించబోతున్న అడ్వకేట్ సందీప్ శర్మ తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురిని మొహాలీలోని ఖరర్ కోర్టులో హాజరుపరిచారు. విద్యార్థినులు స్నానం చేస్తుండగా, సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో పంజాబ్‌లోని చండీగఢ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆందోళనలు మిన్నంటాయి. 60 ఎంఎంఎ్‌సలు(వీడియోలు) వైరల్‌ అయ్యాయని, దీంతో ఏడుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారని జరుగుతున్న ప్రచారాన్ని వర్సిటీ, పోలీసు అధికారులు తోసిపుచ్చారు. ఒక్క విద్యార్థిని తన వ్యక్తిగత వీడియోను ప్రియుడికి పంపిందని, అంతకుమించి మరెవ్వరి వీడియోలూ లేవని ప్రకటించారు.



ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఆ విద్యార్థినిని అరెస్టు చేశారు. ఆమె స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా రోహ్రు పట్టణం. దీంతో దర్యాప్తు బృందం అక్కడికి వెళ్లి ఆమె ప్రియుడు సన్నీ మెహతా(23)ను కూడా అరెస్టు చేసింది. అతన్ని పంజాబ్‌కు తీసుకొచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏడీజీపీ గురుప్రీత్‌ దేవ్‌ చెప్పారు. ఐపీసీ 354సీ (ఇతరులను నగ్నంగా చూసి ఆనందించడం) సెక్షన్‌తోపాటు ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు తెలిపారు. ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ప్రకటించారు. కాగా, స్నానాలు చేస్తున్న వీడియోలు వైరల్‌ అయిన తర్వాత 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు రావడం తనను తీవ్రంగా కలచివేసిందని బీజేపీ నేత మన్జిందర్‌ సింగ్‌ సిర్సా పేర్కొన్నారు. తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, నిందితులపై కఠినంగా వ్యవహరించాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌ రేఖా శర్మ పంజాబ్‌ డీజీపీని ఆదేశించారు. బాధితులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, వారంతా క్షేమంగా, సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించారు.

Updated Date - 2022-09-20T05:04:15+05:30 IST