Union Minister: కొత్త విద్యా విధానంతో అవకాశాలు మెండు

ABN , First Publish Date - 2022-09-11T15:26:34+05:30 IST

కొత్త విద్యా విధానంతో ఉన్నత విద్యలో అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minist

Union Minister: కొత్త విద్యా విధానంతో అవకాశాలు మెండు

                         - కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 10: కొత్త విద్యా విధానంతో ఉన్నత విద్యలో అవకాశాలు మెండుగా ఉన్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman) తెలిపారు. ఇండియన్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ 10వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, ఉత్పత్తి కర్మాగారాలకు నిలయంగా భారత్‌ మారనుందని, ఇలాంటి వృత్తి కర్మాగారాల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని విద్యార్థులు గ్రహించాలన్నారు. అభివృద్ధి పథం దిశగా దేశం సరైన మార్గంలో పయనిస్తుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2028లో చైనా(China) కంటే భారత్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపిందన్నారు. కొత్త విద్యా విధానం ఉన్నత విద్యకు మెరుగైన అవకాశాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల తమ సంపాదనలో కొంత విద్య కోసం కేటాయించాలన్నారు. దేశం మొత్తం జనాభాలో 65 శాతం కార్మికవర్గంగా ఉంటే దేశాభివృద్ధి ఏస్థాయిలో ఉంటుందో ఊహించాలని కేంద్ర మంత్రి కోరారు.

Updated Date - 2022-09-11T15:26:34+05:30 IST