ఉక్రెయిన్ విద్యార్థులకు కేంద్రం పూర్తి మద్దతు

ABN , First Publish Date - 2022-09-23T18:39:21+05:30 IST

ఉక్రెయిన్ విద్యార్థుల (Ukraine Students)కు కేంద్రం (Central Government) పూర్తి మద్దతు తెలిపింది.

ఉక్రెయిన్ విద్యార్థులకు కేంద్రం పూర్తి మద్దతు

New Delhi : ఉక్రెయిన్ విద్యార్థుల (Ukraine Students)కు కేంద్రం (Central Government) పూర్తి మద్దతు తెలిపింది. ఉక్రెయిన్‌ వైద్య విద్యార్థుల ((Ukraine Medical Students)కు ప్రత్యామ్నాయాలు కల్పించే విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు అన్ని తమ పని చేస్తున్నాయని సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తరపున జస్టిస్‌ హేమంత్‌ గుప్తా (Justice Hemanth Guptha), జస్టిస్‌ సుధాంశు ధులియా (Justice Sudhanshu Dhulia) ధర్మాసనానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా (Tushar Mehtha) తెలిపారు. తానే స్వయంగా మంత్రిత్వ శాఖలతో, అధికారులతో సంప్రదింపులు జరపగా... ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారని కోర్టు దృష్టికి సొలిసిటర్‌ జనరల్‌ తీసుకొచ్చారు. తమకు మరికొంత సమయం ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ సుప్రీంకోర్టును కోరారు. కేసు తదుపరి విచారణ అక్టోబర్‌ 11కి ధర్మాసనం వాయిదా వేసింది.


Read more