8,000 మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు పదోన్నతులు

ABN , First Publish Date - 2022-07-02T19:33:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మూడు సెంట్రల్ సెక్రటేరియట్ కేడర్స్‌ ఉద్యోగులకు సామూహిక

8,000 మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు పదోన్నతులు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మూడు సెంట్రల్ సెక్రటేరియట్ కేడర్స్‌ ఉద్యోగులకు సామూహిక పదోన్నతులు కల్పించింది. దీంతో దాదాపు 8,000 మంది లబ్ధి పొందుతారు. సామూహిక పదోన్నతుల కోసం జారీ చేసిన భారీ ఆదేశాల్లో ఇదొకటి. ప్రభుత్వోద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో గతంలో ఈ పదోన్నతులు నిలిచిపోయాయి. 


సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (CSS), సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాఫర్స్ సర్వీస్ (CSSS), సెంట్రల్ సెక్రటేరియట్ క్లరికల్ సర్వీస్ (CSCS)లలోని 8,089 మందికి పదోన్నతులు లభించాయి. 4,734 మంది CSS ఉద్యోగులు, 2,966 మంది CSSS ఉద్యోగులు, 389 మంది CSCS ఉద్యోగులు పదోన్నతులు పొందారు. 


CSSలోని 327 మంది డైరెక్టర్లు, 1,097 మంది డిప్యూటీ సెక్రటరీలు, 1,472 మంది సెక్షన్ ఆఫీసర్లు పదోన్నతులు పొందారు. CSCSలోని స్టెనోగ్రాఫర్లు, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్లు, క్లర్కులు, ఇతరులు కూడా పదోన్నతులు పొందారు. 



కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఉద్యోగులు సరైన పదోన్నతులు లేకుండా పదవీ విరమణ చేస్తుండటాన్ని చూడటం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో ఇదే విధంగా 4,000 మందికి పదోన్నతులు కల్పించింది. 


Updated Date - 2022-07-02T19:33:48+05:30 IST