PFI, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-09-28T15:21:04+05:30 IST

పీఎఫ్ఐ (PFI), దాని అనుబంధ సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ (Central Home Ministry)

PFI, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధించిన కేంద్రం

Delhi : పీఎఫ్ఐ (PFI), దాని అనుబంధ సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ (Central Home Ministry) ఉత్తర్వులు విడుదల చేసింది. యూఏపీఏ చట్టం (UAPA Act) కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), గుజరాత్ (Gujarath), కర్ణాటక (Karnataka) ప్రభుత్వాల నుంచి వచ్చిన విజ్ఞాపన మేరకే పీఎఫ్ఐ సంస్థ (PFI Firm)పై నిషేధం విధించినట్లు సమాచారం. మూడు సార్లు జరిగిన దాడుల్లో... ఈ మూడు రాష్ట్రాల్లో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా..  పీఎఫ్ఐను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు (Authorities) పేర్కొన్నాయి. సంస్థపై నిషేధం ఉండటంతో... పీఎఫ్ఐకి సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి మార్గం సుగమం అయ్యిందని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.


Updated Date - 2022-09-28T15:21:04+05:30 IST