సీబీఎ్‌సఈ కొత్త సిలబ్‌సలో.. ఇస్లామిక్‌ సామ్రాజ్యాల పాఠాల తొలగింపు

ABN , First Publish Date - 2022-04-24T08:02:29+05:30 IST

సీబీఎ్‌సఈ 2022-23 సంవత్సరానికిగాను 10, 11, 12 తరగతులకు కొత్త పాఠ్యప్రణాళిక విడుదల చేసింది.

సీబీఎ్‌సఈ కొత్త సిలబ్‌సలో.. ఇస్లామిక్‌ సామ్రాజ్యాల పాఠాల తొలగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: సీబీఎ్‌సఈ 2022-23 సంవత్సరానికిగాను 10, 11, 12 తరగతులకు కొత్త పాఠ్యప్రణాళిక విడుదల చేసింది. కొత్త సిలబ్‌సలో భారీగా మార్పులున్నాయి. ఆయా తరగతుల్లోని చరిత్ర, రాజనీతి శాస్త్రాల పాఠ్యపుస్తకాల నుంచి అలీనోద్యమం, ప్రచ్ఛన్న యుద్ధ కాలం గురించి, ఇస్లామిక్‌ సామ్రాజ్యాల ఎదుగుదల గురించి ఉన్న పాఠాలను సీబీఎ్‌సఈ తొలగించింది. ఎన్‌సీఈఆర్‌టీ సిఫారసులకు అనుగుణంగా, సిలబస్‌ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ మార్పులు చేసినట్టు అధికారులు వివరిస్తున్నారు. ఇక.. పరీక్ష పద్ధతి గత ఏడాదిలా కాక.. ఈ ఏడాది ఒకే టర్మ్‌ పరీక్ష ఉంటుందని అధికారులు అంటున్నారు. మరోవైపు.. రాజస్థాన్‌ నిర్వహిస్తున్న 12వ తరగతి పరీక్షల్లో రాజనీతిశాస్త్రం ప్రశ్నపత్రం వివాదాస్పదంగా మారింది. అందులోని 23 ప్రశ్నల్లో.. ఆరింటికి కాంగ్రె్‌సను కీర్తించేలా జవాబులు రాయాల్సినవే ఉండడం ఇందుకు కారణం. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది? కాంగ్రెస్‌ పార్టీ సామాజిక, సైద్ధాంతిక భావజాలంపై సంక్షిప్తంగా చర్చించండి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది? 1967 సార్వత్రిక ఎన్నికల ఫలితమేమిటి, గరీబీ హఠావో నినాదాన్ని ఎవరిచ్చారు?.. ఇలా సమాధానంగా కాంగ్రెస్‌ గొప్పదనాన్ని రాయక తప్పని విధంగా ప్రశ్నపత్రాన్ని రూపొందించడంతో.. అధికార కాంగ్రెస్‌ సర్కారుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read more