కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇల్లు,ఆఫీసులపై CBI raids

ABN , First Publish Date - 2022-05-17T15:15:12+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీపై కొనసాగుతున్న కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సోదాలు...

కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఇల్లు,ఆఫీసులపై CBI raids

చెన్నై(తమిళనాడు): కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీపై కొనసాగుతున్న కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తోంది.కార్తీ చిదంబరానికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై కేంద్ర ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది.ఢిల్లీ, ముంబై, చెన్నై,తమిళనాడులోని శివగంగైలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.శివగంగ నుంచి కాంగ్రెస్ ఎంపీ అయిన కార్తీ చిదంబరంపై కొనసాగుతున్న కేసుకు సంబంధించి ఏడు ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.



2010-14 మధ్య కాలంలో విదేశీ రెమిటెన్స్‌ల ఆరోపణలపై కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ తాజా కేసు నమోదు చేసింది.కార్తీ చిదంబరం తన తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.305 కోట్ల మేర విదేశీ నిధులను స్వీకరించినందుకు ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ క్లియరెన్స్‌కు సంబంధించిన కేసుతో సహా పలు కేసుల్లో విచారణ జరుగుతోంది.

Updated Date - 2022-05-17T15:15:12+05:30 IST