బీజేపీ నేత తాజిందర్ బగ్గాపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-04-04T02:50:56+05:30 IST

అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బగ్గాపై ఆప్ మండిపడుతోంది. ఆప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలోని బగ్గా నివాసానికి పంజాబ్ పోలీసులు శనివారం రాత్రి వచ్చారట. ఆ సమయంలో బగ్గా అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారట..

బీజేపీ నేత తాజిందర్ బగ్గాపై కేసు నమోదు

న్యూఢిల్లీ: మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఢిల్లీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ సింగ్ బగ్గాపై నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. మొహాలికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత సన్నీ అహ్లువాలియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయింది. తప్పుడు సమాచారం ఆధారంగా మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా, మత సామరస్యాన్ని పాడు చేసే విధంగా బగ్గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అహ్లువాలియా పేర్కొన్నారు.


అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని బగ్గాపై ఆప్ మండిపడుతోంది. ఆప్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీలోని బగ్గా నివాసానికి పంజాబ్ పోలీసులు శనివారం రాత్రి వచ్చారట. ఆ సమయంలో బగ్గా అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారట. ఇదే కాకుండా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో బగ్గాపై కేసులు నమోదు అయ్యాయట. సైబర్ క్రైంలో కూడా కేసులు నమోదు అయినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

Read more