తమిళనాడులో కరోనా థర్డ్‌వేవ్‌

ABN , First Publish Date - 2022-01-03T17:38:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మూడో అల (థర్డ్‌ వేవ్‌) మొదలైందని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు.

తమిళనాడులో కరోనా థర్డ్‌వేవ్‌

పాఠశాలల్లోనే విద్యార్థులకు టీకాలు

ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం 

మెగా వ్యాక్సినేషన్‌కు విశేష స్పందన


చెన్నై, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి మూడో అల (థర్డ్‌ వేవ్‌) మొదలైందని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 17వ మెగా వ్యాక్సినేషన్‌ కార్య క్రమం జరిగింది. ఇందులోభాగంగా తన సొంత నియోజకవర్గమైన సైదాపేటలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటివరకు రాష్ట్రంలో 86.22 శాతం ప్రజలు మొదటి డోస్‌, 58.82 శాతం మంది రెండో డోసు టీకాలు వేసుకున్నారన్నారు. చెన్నైలో మాత్రం ఇంకా 5 లక్షల మంది మొదటి డోస్‌ టీకా వేయించుకోలేదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేసేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుందన్నారు. 


శరవేగంగా వైరస్‌ వ్యాప్తి... 

రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా సాగుతోందని మంత్రి చెప్పారు. మూడో దశ అల ప్రారంభమైందని తెలి పారు. మరో పది రోజుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుకుంటుం దన్నారు. ఈ కరోనా వేరియంట్లలో డెల్టా, ఒమైక్రాన్‌ వైరస్‌లు కలిసి పోవడంతో ఈ వైరస్‌ వ్యాప్తి శరవేగంగా సాగుతోందన్నారు. గత యేడాది ప్రపంచ వ్యాప్తంగా గరిష్టంగా ఏప్రిల్‌లో ఒకే రోజున 29.04 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని, ఇవే ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులని గుర్తుచేశారు. ఇపుడు మూడో దశలో ఒకే రోజున ప్రపంచ స్థాయిలో 18.91 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత మే నెల 21వ తేదీన రాష్ట్రంలో 36,084 కేసులు నమోదయ్యాయని, ఇపుడు మూడో దశలో ఆ స్థాయిలో కేసుల నమోదు అవుతాయేమోనని ఆందోళన చెందుతున్నా మన్నారు. అయితే, ఒమైక్రాన్‌ వైరస్‌ సోకిన మూడు లేదా నాలుగు రోజుల్లో నెగెటివ్‌ ఫలితం వస్తోందని, ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమన్నారు. 


నెగెటివ్‌ వచ్చిన 5 రోజులు ఆస్పత్రుల్లోనే... 

ఒమైక్రాన్‌ సోకిన రోగికి మూడు రోజుల్లోనే పరీక్ష చేయగా నెగెటివ్‌ ఫలితం వస్తోందని, అయినప్పటికీ ఐదు రోజుల వరకు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత మరోమారు టెస్ట్‌ చేసి నెగెటివ్‌ ఫలితం వస్తేనే డిశ్చార్జ్‌ చేస్తున్నామని వివరించారు. అందువల్ల ఒమైక్రాన్‌ వైరస్‌ సోకిన రోగి ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు చికిత్స తీసుకుంటే సరిపోతుందని నిర్ణయించాయమన్నారు.


సీఎం చేతుల మీదుగా పిల్లలకు వ్యాక్సిన్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి 15 నుంచి 18 యేళ్ళలోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. సైదాపేటలోని మాంతోపు పాఠశాల లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ పాల్గొంటార న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33.46 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ కూడా తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. 


ముందస్తు ఏర్పాట్లు...

రాష్ట్రంలో కరోనా మూడో దశ తీవ్రరూపం దాల్చినట్టయితే, దాన్ని సమ ర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలోని ఈంజం బాక్కం, మంజంబాక్కం, కొడుంగయూరు ప్రాంతాల్లో కరోనా ప్రత్యేక వార్డు లో వెయ్యి పడకలు సిద్ధంగా ఉన్నాయన్నారు. చెన్నై వాణిజ్య కేంద్రం (ట్రేడ్‌ సెంటర్‌)లో 800 పడకలు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. హౌసింగ్‌ బోర్డు లకు చెందిన గృహాల్లో మరో 2 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 


త్వరలో బూస్టర్‌ డోస్‌...

రాష్ట్రంలో 60 యేళ్ళుపైబడి రెండు డోసుల టీకాలు వేసుకుని 9 నెలల దాటిన వారికి బూస్టర్‌ డోసు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి స్టాలిన్‌ లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. అయితే కొవిషీల్డ్‌ లేదా కొవ్యాగ్జిన్‌ టీకాలు వేయించుకున్న వారికి అదే టీకాలతో కూడిన బూస్టర్‌ డోసు వేయాలా లేక, వేరేది వేయాలా అన్నదానిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 


పల్స్‌ ఆక్సీమీటర్ల పంపిణీ?

కరోనా థర్డ్‌వేవ్‌ విజృంభించిన పక్షంలో రెండు డోస్‌లు టీకాలు తీసుకున్న తరువాత కూడా ఎవరైనా కరోనా బారిన పడితే, ఇంట్లోనే చికిత్స తీసుకో వాలని మంత్రి సూచించారు. ఇలాంటి వారికి పల్స్‌ ఆక్సీమీటర్లను అందించే విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ యోచిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇంగ్లండ్‌ లో ఈ ఆక్సీమీటర్లను రోగులకు అందించారని గుర్తు చేశారు. ఇదే విధా నాన్ని ఇక్కడ కూడా అమలు చేసే అంశంపై సీఎం సంబంధిత అధికా రులతో సమాలోచనలు జరుపుతున్నారని చెప్పారు. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ 92 కంటే తక్కుడ పడిపోతే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిం చేలా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సుబ్రమణ్యం వివరించారు. ఇదిలా వుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరిగిన టీకాల పంపిణీ శిబిరాలకు విశేష స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-01-03T17:38:52+05:30 IST