బుర్కినా ఫాసో బంగారు గనిలో పేలుడు...63కు చేరిన మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2022-02-23T17:47:45+05:30 IST

బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో సంభవించిన పేలుడులో 63 మంది మరణించారు....

బుర్కినా ఫాసో బంగారు గనిలో పేలుడు...63కు చేరిన మృతుల సంఖ్య

బుర్కినా ఫాసో: బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో సంభవించిన పేలుడులో 63 మంది మరణించారు.బంగారపు గనిలో సంభవించిన పేలుడుతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 22 కమాండడో ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ అధికారులు హుటాహుటిన వచ్చి పేలుడు ప్రాంతంలో సహాయ పనులు చేపట్టారు. మృతదేహాలను తరలించారు.ఈ పేలుడులో క్షతగాత్రులను గౌవాలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆపరేషన్ చేసేందుకు సర్జరీ రూంకు తరలించామని గౌవా ఆసుపత్రి జనరల్ మేనేజరు డాక్టర్ ఫ్రాన్సిస్ ఆల్బర్ట్ చెప్పారు.


 పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన బంగారు గనిలో ఈ పేలుడు సంభవించింది. అక్రమ బంగారం తవ్వకాలపై నిషేధం విధించినప్పటికీ అనధికారికంగా బంగారం కోసం తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.ఈ పేలుడు ఘటన అనంతరం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-02-23T17:47:45+05:30 IST