Bulldozers: అత్యాచారం కేసులో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేత

ABN , First Publish Date - 2022-09-19T18:51:23+05:30 IST

మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోనూ ఇళ్ల కూల్చివేతకు(demolish houses) బుల్డోజర్లను(Bulldozers) బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది....

Bulldozers: అత్యాచారం కేసులో నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేత

భోపాల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోనూ ఇళ్ల కూల్చివేతకు(demolish houses) బుల్డోజర్లను(Bulldozers) బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది. ఓ టీనేజ్ బాలికపై( teenage girl) సామూహిక అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. రేవా జిల్లాలోని నయాగర్హి దేవాలయానికి ఓ టీనేజ్ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాగా, ఆరుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ అత్యాచారం కేసులో నిందితులైన ముగ్గురి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు.ఈ అత్యాచార ఘటన అష్టభుజి మాత దేవాలయం వద్ద జరిగింది. 


దేవాలయాన్ని దర్శించుకున్న బాలిక తన స్నేహితుడితో కలిసి కూర్చోగా ఆరుగురు యువకులు వచ్చి జలపాతం వద్దకు ఆమను లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. అనంతరం నిందితులు బాలిక మొబైల్ ఫోన్ ను లాక్కున్నారు.అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. సామూహిక అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.నిందితులపై ఐపీసీ సెక్షన్ 376, 395, 506, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని,మూడు ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయగా, మరో ముగ్గురు నిందితుల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. 

Read more