Brahmotsavams: వైభవంగా ముగిసిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-29T08:56:03+05:30 IST

స్థానిక టి.నగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి(Padmavati) అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఆస్థానం పూజలతో ముగిశా

Brahmotsavams: వైభవంగా ముగిసిన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ప్యారీస్‌(చెన్నై), నవంబరు 28: స్థానిక టి.నగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పద్మావతి(Padmavati) అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఆస్థానం పూజలతో ముగిశాయి. ఉదయం స్తపన తిరుమంజనం, చక్రస్నానం, సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారి గజలక్ష్మి విశేష అలంకార పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేది అంకురార్పణంతో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, సోమవారం వరకు వివిధ వాహనాలపై అమ్మవారి ఉత్సవమూర్తిని మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavams) చివరి రోజైన సోమవారం గజ ప్రతిమకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్తపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం చక్రస్నానం నిర్వహించగా, పాలక మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ దంపతులు, సభ్యులు పీవీఆర్‌ కృష్ణారావు, మోహన్‌రావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో విజయకుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-11-29T08:56:05+05:30 IST