38 ఏళ్ల తర్వాత దొరికిన సైనికుడి అస్థికలు

ABN , First Publish Date - 2022-08-15T09:49:46+05:30 IST

ముప్పై ఎనిమిదేళ్ల క్రితం అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ అస్థికలు శనివారం లభించాయి.

38 ఏళ్ల తర్వాత దొరికిన సైనికుడి అస్థికలు

సియాచిన్‌లో భారీ హిమపాతం వల్ల అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ముప్పై ఎనిమిదేళ్ల క్రితం అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ అస్థికలు శనివారం లభించాయి. సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో సియాచిన్‌ గ్లేసియర్‌పై సైనికులు చంద్రశేఖర్‌ అస్థికలను గుర్తించారు. చంద్రశేఖర్‌ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ. ఆపరేషన్‌ మేఘదూత్‌లో భాగంగా 1984లో సియాచిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన 19 కుమవూన్‌ రెజిమెంట్‌లో సభ్యుడు. ఆ ఏడాది మే 29న సియాచిన్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. మరుసటి రోజేభారీ హిమపాతం సంభవించడంతో 19 మంది సైనికులు చనిపోయారు. వారిలో 14 మంది మృతదేహలు దొరికాయి. గాలింపు కొనసాగుతుండగా.. చంద్రశేఖర్‌ అస్థికలు దొరికాయి.

Read more