రోజుకు 18 గంటలు పనిచేయండి

ABN , First Publish Date - 2022-08-31T08:29:09+05:30 IST

కెరీర్‌ తొలినాళ్లలో యువత రోజులో 18 గంటలు ఆఫీసు పనికే కేటాయించాలని బాంబే షేవింగ్‌ కంపెనీ సీఈవో ఇచ్చిన సలహా తీవ్ర విమర్శలకు

రోజుకు 18 గంటలు పనిచేయండి

యువతకు బాంబే షేవింగ్‌ కంపెనీ సీఈవో సలహా


న్యూఢిల్లీ, ఆగస్టు 30: కెరీర్‌ తొలినాళ్లలో యువత రోజులో 18 గంటలు ఆఫీసు పనికే కేటాయించాలని బాంబే షేవింగ్‌ కంపెనీ సీఈవో ఇచ్చిన సలహా తీవ్ర విమర్శలకు దారితీసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు బాంబే షేవింగ్‌ కంపెనీ సీఈవో శంతను దేశ్‌పాండే తన సోషల్‌ మీడియా ఖాతా లింక్‌డ్‌ఇన్‌ వేదికగా కొన్ని సలహాలు ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలో 4-5 ఏళ్లపాటు రోజుకు 18 గంటలు ఆఫీస్‌ పనికి కేటాయించాలని సూచించారు. ‘‘22 ఏళ్ల వయసులో మీరు ఉద్యోగంలో చేరితే.. పూర్తిగా అందులోనే ముగినిపోవాలి. సరిగ్గా తింటూ, ఆరోగ్యంగా ఉంటూ.. కనీసం నాలుగైదేళ్లపాటు రోజుకు 18 గంటలు ఆఫీసు పనిచేయాలి’ అని సూచించారు. అయితే ఆయన సలహాపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ట్‌పలలో ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగిస్తున్న వేళ ఇలాంటి సలహాలు యువత భవిష్యత్తుకు మరింత ప్రమాదకరంగా మారతాయని నెటిజన్లు పేర్కొన్నారు.

Read more