Bomb Hoax: గణితపరీక్షను రద్దు చేయించడం కోసం విద్యార్థి డ్రామా

ABN , First Publish Date - 2022-09-13T16:27:03+05:30 IST

గణిత పరీక్ష అంటే కొంతమంది విద్యార్థులకు ముచ్చెమటలు పడుతుంటాయి. ...

Bomb Hoax: గణితపరీక్షను రద్దు చేయించడం కోసం విద్యార్థి డ్రామా

అమృత్‌సర్ (పంజాబ్): గణిత పరీక్ష అంటే కొంతమంది విద్యార్థులకు ముచ్చెమటలు పడుతుంటాయి. గణిత పరీక్ష రద్దు(Maths Exam Cancelled) చేయించడం కోసం పాఠశాలలో బాంబు పెట్టామంటూ ఓ విద్యార్థి(Student) బాంబు బెదిరింపు(Bomb Hoax) నాటకం ఆడిన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్(Amritsar) నగరంలో వెలుగుచూసింది. అమృత్‌సర్ నగరంలోని పాఠశాలను(Amritsar School) సెప్టెంబర్ 16వతేదీన బాంబులతో(Bomb) పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు మెసేజ్ ద్వారా బెదిరించారు. బాంబు బెదిరింపు సందేశానికి మూలం పాఠశాల విద్యార్థి తండ్రి మొబైల్ ఫోన్‌లో ఉందని పోలీసులు కనుగొన్నారు.


గణిత పరీక్ష రద్దు చేయించడానికే విద్యార్థి తన తండ్రి సెల్ ఫోన్ నుంచి బాంబు బెదిరింపు నాటకం ఆడారని పోలీసుల దర్యాప్తులో తేలింది.అమృత్‌సర్‌ నగరంలో వారం వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం రెండోసారి. దీంతో అమృత్‌సర్‌ నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి.నగరంలోని ఒక ఉన్నత పాఠశాల సెప్టెంబర్ 7న బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై అర్ధరాత్రి సోదాలు చేపట్టారు. 


Updated Date - 2022-09-13T16:27:03+05:30 IST