ఆదివారం బెంగళూరుకు నవీన్ శేఖరప్ప మృతదేహం

ABN , First Publish Date - 2022-03-19T01:27:59+05:30 IST

ఉక్రెయిన్‌లో చనిపోయిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం ఆదివారం బెంగళూరు చేరుకోనుంది..

ఆదివారం బెంగళూరుకు నవీన్ శేఖరప్ప మృతదేహం

బెంగళూరు: ఉక్రెయిన్‌లో చనిపోయిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం ఆదివారం బెంగళూరు చేరుకోనుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నవీన్ ఖార్కివ్ నేషనల్  మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.


ఈ నెల 1న ఆహారం కొనేందుకు బయటకు వచ్చి క్యూలో నిల్చున్న సమయంలో రష్యా బాంబు దాడిలో మరణించాడు. సమీపంలోని ప్రభుత్వం భవనం పైనుంచే రష్యన్ దళాలు దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. నవీన్ మృతిపై విచారణ జరిపిస్తామని రష్యా పేర్కొంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. నవీన్ శేఖరప్ప ఎలా మృతి చెందాడన్న దానిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేదని చెప్పారు. 

Read more