Bhajans-Kirtans in Temples: దేవాలయాల్లో భజనలు, కీర్తనల కోసం ఎంపీల్యాడ్స్ నిధులు...బీజీపీ ఎంపీ నిర్వాకం

ABN , First Publish Date - 2022-12-13T08:21:21+05:30 IST

బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఉద్ధేశించిన ఎంపీల్యాడ్స్ నిధులను....

Bhajans-Kirtans in Temples: దేవాలయాల్లో భజనలు, కీర్తనల కోసం ఎంపీల్యాడ్స్ నిధులు...బీజీపీ ఎంపీ నిర్వాకం
BJP MP Virendra Singh

బలియా : బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్ తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఉద్ధేశించిన ఎంపీల్యాడ్స్ నిధులను ఆలయాల్లో భజనలు, కీర్తనల(Bhajans-Kirtans) కోసం వినియోగించాలని బలిమా బీజేపీ ఎంపీ వీరేంద్రసింగ్ (BJP MP Virendra Singh)అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో(Temples) సంప్రదాయ విలువలు కనుమరుగవుతున్నాయని, ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధులను ఆధ్యాత్మిక మేలు కొలుపు కోసం ఆలయాల్లో భజనలు, కీర్తనల కోసం వినియోగించాలని ఎంపీ అధికారులను ఆదేశించి సంచలనం సృష్టించారు.

బలియా జిల్లాలోని చిన్న, పెద్ద దేవాలయాలను సర్వే చేసి భజనలు, కీర్తనలు పాడేందుకు వీలుగా సంగీత వాయిద్యాల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఎంపీ సింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయాల్లో భజనలు, కీర్తనలు పాడేందుకు కావాల్సిన సంగీత వాయిద్య పరికరాల సమస్య ఉంటే ఎంపీ ల్యాడ్స్ నిధులను ఉపయోగించవచ్చని ఎంపీ సింగ్ అధికారులకు సూచించారు.

ప్రతీ ఎంపీకి ఏటా రూ.5కోట్ల నిధుల కోటా వస్తోంది. రోడ్లు, పాఠశాల భవనాలు, ఆసుపత్రి భవనాల నిర్మాణం చేపట్టాల్సిన నిధులను భజనలు, కీర్తనల కోసం వినియోగించాలని నిర్ణయించడం వివాదం రేపుతోంది. నాలుగుసార్లు ఎంపీ అయిన సింగ్ ప్రజల్లో ఆధ్యాత్మిక మేలు కొలుపు(Traditional values) కోసం ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.భజనల కోసం ఎంపీ చేస్తున్న కృషిని బల్లియాలోని భృగు దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ శివకుమార్ మిశ్రా అభినందించారు.

ఆలయాల సర్వే త్వరలో ప్రారంభమవుతుందని బల్లియా నగర్ పాలికా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య ప్రకాశ్ సింగ్ తెలిపారు.బల్లియాలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భృగు మహర్షికి అంకితం చేసిన కారిడార్‌ను నిర్మిస్తోందని ఎంపీ చెప్పారు.

Updated Date - 2022-12-13T08:32:29+05:30 IST