కారుతో ఢీకొట్టి.. ఆపకుండా వెళ్లిపోయి..

ABN , First Publish Date - 2022-11-30T02:32:13+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ హరీశ్‌ ద్వివేది చేసిన నిర్వాకానికి ఓ నిండుప్రాణం బలైంది. రోజులానే స్కూలు నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ చిన్నారిని ఎంపీ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టగా ఆయన కనీసం కారు ఆపలేదు.

కారుతో ఢీకొట్టి..   ఆపకుండా వెళ్లిపోయి..

యూపీలో బీజేపీ ఎంపీ నిర్వాకం

తొమ్మిదేళ్ల బాలుడి మృతి

బస్తి, నవంబరు 29: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ హరీశ్‌ ద్వివేది చేసిన నిర్వాకానికి ఓ నిండుప్రాణం బలైంది. రోజులానే స్కూలు నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ చిన్నారిని ఎంపీ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టగా ఆయన కనీసం కారు ఆపలేదు. గాయాలతో అల్లాడుతున్న ఆ బాలుణ్ని ఆసుపత్రికి కూడా తరలించలేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, మానవత్వాన్ని మరచిన ఆ ఎంపీ తీరుతో అభం శుభం తెలియని ఆ బాలుడు మృతిచెందాడు. బస్తికి చెందిన శతృఘన్‌ రాజ్‌భర్‌ ఏకైక కుమారుడు అభిషేక్‌(9) స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా హార్దియా కూడలి వద్ద ఓ ఎస్‌యూవీ వాహనం ఢీకొట్టింది. గాయాలపాలైన అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు లఖ్‌నవూకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడి తండ్రి శతృఘన్‌ రాజ్‌భర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మనౌరి వైపు నుంచి వస్తున్న ఎంపీ హరీశ్‌ ద్వివేదికి చెందిన రెండు ఎస్‌యూవీ కార్లలో ఒకటి ఽఢీకొట్టినట్లుగా సీసీ టీవీ పుటేజీ ఆధారంగా గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి గాయాలపాలైన తన కొడుకును ఆస్పత్రికి తరలించలేదని, కనీసం కారు కూడా దిగలేదని రాజ్‌భర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-30T02:32:13+05:30 IST

Read more