బెలగావి Shahi masjidపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-30T12:42:25+05:30 IST

బెలగావి Shahi masjidపై బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

బెలగావి Shahi masjidపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బెలగావి(కర్ణాటక): బెలగావి Shahi masjidపై బీజేపీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెలగావి షాహి మసీదు ఆలయంపై నిర్మించారని ఎమ్మెల్యే ఆరోపించారు.వారాణసీలో జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్నందున నేపథ్యంలో అభయ్ పాటిల్ తాజాగా మరో మసీదు వివాదాన్ని లేవనెత్తారు. బెలగావిలోని షాహీ మసీదు వాస్తవానికి హిందూ దేవాలయమని, దీనికి సంబంధించి సర్వే నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే కోరారు.ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. తాను వెళ్లి మసీదును చూసేసరికి తనకు కూడా అలాగే అనిపించిందని పాటిల్ చెప్పారు. ‘‘మసీదులో, దేవాలయాల గర్భగుడిలో కనిపించే తలుపు ఉంది. వంగి లోపలికి ప్రవేశించే చిన్న తలుపులు దేవాలయాల్లో కనిపిస్తాయి, మసీదుల్లో కాదు’’అని పాటిల్ పేర్కొన్నారు.బెలగావి షాహి మసీదు వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది.


Read more