Assam CM Himanta Sarma: ముస్లిం పురుషులకు బహుళ భార్యలపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-09T10:59:48+05:30 IST

అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు....

Assam CM Himanta Sarma: ముస్లిం పురుషులకు బహుళ భార్యలపై అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు
Assam CM Himanta Sarma

అంజార్ (అసోం):అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పురుషులు (Muslim Mens)బహు భార్యలను(Multiple Wives) వివాహాలు చేసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.(Assam CM Himanta Sarma)‘‘స్వతంత్ర భారతదేశంలో నివసిస్తున్న పురుషుడు తన జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మూడు-నాలుగు పెళ్లిళ్లు చేసుకునే హక్కు లేదు. అలాంటి వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని ఇక్కడ జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ముస్లిం పిల్లలందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే సాధారణ పాఠశాలలు, కళాశాలల్లో చేరాలని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని సీఎం చెప్పారు.మొరిగావ్‌లోని ఒక మదర్సాలో అల్-ఖైదా లింకుల గురించి తాను ఆందోళన చెందుతున్నానని సీఎం చెప్పారు. తాము మొరిగావ్ జిల్లాను అల్-ఖైదా స్థావరంగా మార్చలేమని సీఎం శర్మ స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-09T11:18:07+05:30 IST