బర్డ్‌ఫ్లూ సోకే అవకాశాలు తక్కువే

ABN , First Publish Date - 2022-02-23T22:56:08+05:30 IST

బర్డ్‌ఫ్లూ తాజా వేరియెంట్ హెచ్5ఎన్1 వైరస్ అంత ప్రమాదకారి కాదని, ఇది మనుషులకు సోకే అవకాశాలు తక్కువే అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల్లో శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

బర్డ్‌ఫ్లూ సోకే అవకాశాలు తక్కువే

ప్రపంచవ్యాప్తంగా పౌల్ట్రీ రంగాన్ని వణికిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ అప్పుడప్పుడూ మనుషులకూ సోకుతుంది. గతేడాది మన దేశంలోని హరియాణాలో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. అయితే, బర్డ్‌ఫ్లూ తాజా వేరియెంట్ హెచ్5ఎన్1 వైరస్ అంత ప్రమాదకారి కాదని, ఇది మనుషులకు సోకే అవకాశాలు తక్కువే అని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల్లో శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ సాధారణంగా పక్షులకు సోకుతుంది. అయితే, అరుదుగా మనుషులకూ సోకుతుంది. గత ఏడాది దాదాపు పదిహేను దేశాల్లో వైరస్ మనుషులకు సోకింది. వాటిలో మన దేశం కూడా ఉంది.


బర్డ్ ఫ్లూకు కారణమయ్యే హెచ్5ఎన్1 వైరస్ మనుషులపై ప్రభావాన్ని చూపాలంటే, అది మనుషుల్లో ఉండే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌తో కలిసి కొత్త మ్యుటెంట్‌ను ఏర్పర్చాలి. అప్పుడు మాత్రమే ఆ వైరస్ మనుషులకు సోకుతుంది. అందువల్లే ఈ వైరస్ చాలా తక్కువ మందిపై ప్రభావాన్ని చూపిస్తోంది. అది కూడా పౌల్ట్రీ రంగంలో పనిచేసే వాళ్లపై మాత్రమే. పౌల్ట్రీ రంగ సిబ్బంది పక్షులకు దగ్గరగా ఉండటం వల్ల మాత్రమే త్వరగా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. దీంతో మనుషుల నుంచి మనుషులకు వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందక్కర్లేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పుణేకు చెందిన డైరెక్టర్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్, డాక్టర్ సంజయ్ చెప్పారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఎండెమిక్ దశకు చేరుకుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Updated Date - 2022-02-23T22:56:08+05:30 IST