మందుల ఖర్చు 2000 డాలర్లు దాటొద్దు

ABN , First Publish Date - 2022-08-17T06:38:44+05:30 IST

పర్యావరణ పరిరక్షణ, సామాన్యులకు వైద్య బీమా కోసం ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌

మందుల ఖర్చు 2000 డాలర్లు దాటొద్దు

చరిత్రాత్మక బిల్లుపై నేడు బైడెన్‌ సంతకం


కైవా ఐలండ్‌(సౌత్‌ కరోలీనా), ఆగస్టు 16: పర్యావరణ పరిరక్షణ, సామాన్యులకు వైద్య బీమా కోసం ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం) సంతకం చేయనున్నారు. ఈ బిల్లు ప్రకారం వాతావరణ మార్పులను అరికట్టేందుకు అమెరికా పదేళ్ల వ్యవధిలో 375 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తం విలువ రూ.30 లక్షల కోట్లతో సమానం. అంతేకాకుండా, వైద్య బీమా ఉన్న  అమెరికన్‌ పౌరుడు తను ఏడాది పొడవున వాడే ఏ ఔషఽధానికి కూడా 2000 డాలర్లకు మించి తన జేబు నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చూడాలని తాజా బిల్లు నిర్దేశించింది. 2000 డాలర్లకు మించిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దీంతో కోట్ల మంది అమెరికన్లకు మేలు జరగనుంది. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.

Updated Date - 2022-08-17T06:38:44+05:30 IST