బైడెన్‌ మతిమరుపు తిప్పలు!

ABN , First Publish Date - 2022-10-01T07:21:02+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరచూ మతిమరుపుతో ఇబ్బందులు పడుతున్నారు. స్టేజీ మీద మాట్లాడిన అంశాలు మర్చిపోతున్నారు.

బైడెన్‌ మతిమరుపు తిప్పలు!

ప్రసంగం అనంతరం దారిమరచి ముందుకు..

వాషింగ్టన్‌, సెప్టెంబరు 30: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరచూ మతిమరుపుతో ఇబ్బందులు పడుతున్నారు. స్టేజీ మీద మాట్లాడిన అంశాలు మర్చిపోతున్నారు. ప్రసంగం పూర్తయ్యాక ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ద్వైపాక్షిక సమావేశాల్లో దేశాధినేతల పేర్లు మర్చిపోతున్నారు. ఇటీవల ఓ సమావేశంలో చనిపోయిన సెనేటర్‌ ఇక్కడే ఉన్నారని ప్రస్తావించిన ఆయన తాజాగా.. ఫెడరల్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఫెమా) కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ తన ప్రసంగం ముగిసిన తర్వాత.. దారి తప్పి మరోవైపు వెళ్లారు. పక్కనే ఉన్న ఫెమా సిబ్బంది ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారు. అమెరికాలో హరికేన్‌ ఇయాన్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఫెమా కార్యాలయానికి వెళ్లిన బైడెన్‌.. అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆయన ఎడమవైపు వెళ్లాల్సి ఉండగా కుడివైపు తిరిగి ముందుకు సాగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సరదా సరదా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఇది చాలా బాధాకరం అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Read more