రాష్ట్రానికి ‘భారత్‌ గౌరవ్‌’ Train

ABN , First Publish Date - 2022-05-29T17:36:19+05:30 IST

ఏడాది క్రితం కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన పర్యాటక సర్క్యూట్‌ రైలు ‘భారత్‌ గౌరవ్‌’ రాష్ట్రానికి త్వరలోనే రానుంది. రాష్ట్ర దేవదాయశాఖ ఇందుకు సంబంధించి అధికారికంగా

రాష్ట్రానికి ‘భారత్‌ గౌరవ్‌’ Train

                        - పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ 


బెంగళూరు: ఏడాది క్రితం కేంద్ర రైల్వేశాఖ ప్రకటించిన పర్యాటక సర్క్యూట్‌ రైలు ‘భారత్‌ గౌరవ్‌’ రాష్ట్రానికి త్వరలోనే రానుంది. రాష్ట్ర దేవదాయశాఖ ఇందుకు సంబంధించి అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. రాష్ట్రమంతటా సంచరించే దేశ విదేశీ పర్యాటకులకు ఇది ప్రత్యేక ఆకర్షణ కానుంది. దేశంలోని సాంస్కృతిక పరంపర, చారిత్రక స్థలాలను ‘భారత్‌ గౌరవ్‌’ రైలు ద్వారా సందర్శించేందుకు వీలుంటుంది. కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, ఒడిస్సాలలో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు. కర్ణాటకలో సేవలు క ల్పించేందుకు దేవదాయశాఖ ముందుకు వచ్చింది. ప్రైవేట్‌ టూరిజం సంస్థలు పర్యాటక ప్యాకేజీ తరహాలోనే ఈ సేవలు ఉంటాయి. ఏ రైలు ఎప్పుడు ఎక్కడ ప్రారంభమై, ఏఏ ప్రాంతాలకు వెళుతుందనే సమాచారం రైల్వేశాఖ నిర్ణయి స్తుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. ప్ర స్తుత రైల్వేశాఖ సాధారణ షెడ్యూల్‌కు దీనికి సంబంధం లేదు. ప్రైవేట్‌ వ్యక్తులు, సంఘ సంస్థలు, ట్రస్టులు, సంఘాలు, పర్యాటక ఏజెంట్లతోపాటు రాష్ట్రప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంలో సేవలను అందుబాటులోకి తీసుకు వస్తారు. ఇందులో పర్యటించేవారికి హోటల్‌, వసతి, ప్రముఖ స్థలాల సందర్శన, చారిత్రాత్మక కేంద్రాల వీక్షణకు ప్యాకేజీలు నిర్ణయిస్తారు. రాష్ట్రానికి ఏటా వేలాదిమంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వారు నాలుగైదు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంటారు. ‘భారత్‌ గౌరవ్‌’ రైలుయాత్రతో మరిన్ని ప్రముఖ స్థలాల ను వీక్షించే అవకాశం ఉంది. 

Read more