Bharat Jodo Yatra: మరో కాంట్రవర్సీ... 3రోజులు... 3వివాదాలు

ABN , First Publish Date - 2022-09-10T21:22:44+05:30 IST

కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టి మూడు రోజులు కాకముందే మూడు కాంట్రవర్సీలు వెలుగుచూశాయి.

Bharat Jodo Yatra: మరో కాంట్రవర్సీ... 3రోజులు... 3వివాదాలు

కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టి మూడు రోజులు కాకముందే మూడు కాంట్రవర్సీలు వెలుగుచూశాయి. 


1. లగ్జరీ కంటైనర్లు 

2. కాస్ట్‌లీ టీ షర్ట్ 

3. పాస్టర్‌ జార్జి పొన్నయ్య


1. లగ్జరీ కంటైనర్లు: 


విలాసవంతమైన కంటైనర్లతో పాదయాత్ర చేయడమేంటని అధికార భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏసీ సౌకర్యం ఉన్న లగ్జరీ కంటైనర్లు అవసరమా అని ప్రశ్నిస్తోంది.   


2. కాస్ట్‌లీ టీ షర్ట్: 


భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ బర్బెరీ బ్రాండ్‌కు చెందిన టీ-షర్టు ధరించారని, దీని ధర రూ.41వేలు అని బీజేపీ చెబుతోంది. రాహుల్‌ ఎంత ఖరీదైన టీ-షర్టును ధరించారో చూడండంటూ ‘భారత్‌ దేఖో’ అనే క్యాప్షన్నూ పెట్టింది. రాహుల్‌ ఫొటో పక్కన రూ.41,257 ఖరీదైన బర్బెరీ బ్రాండ్‌ టీషర్టును పోస్టు చేసింది. విలాసవంతమైన వస్త్రధారణతో నిరుపేదల సమస్యలు తెలుసుకుంటారా అని బీజేపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. 


3. పాస్టర్‌ జార్జి పొన్నయ్య: 


 ''భారత్ జోడో యాత్ర''లో భాగంగా రాహుల్ గాంధీ తమిళనాడుకు చెందిన ఒక వివాదాస్పద కేథలిక్ పాస్టర్‌ను (Controversiala catholic pastor) శుక్రవారంనాడు కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణలతో కూడిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీజేపీ నేతలు దీనిపై విమర్శలు గుప్పించారు. కన్యాకుమారి జిల్లాలో కేథలిక్ ప్రీస్ట్ జార్జి పొన్నయ్య (george ponniah)ను రాహుల్ గాంధీ (Rahul gandhi) కలుసుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో భాగంగా రాహుల్ గాంధీ ఆయనను ''ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా?'' అని ప్రశ్నించారు. వెంటనే జార్జి పొన్నయ్య తడుముకోకుండా ''ఆయన ఒక్కడే నిజమైన దేవుడు'' అని సమాధానమిచ్చారు. తన వాదన కొనసాగుస్తూ, భగవంతుడు మనిషి రూపంలోనే వెల్లడవుతాడు, మీ శక్తి లాంటి వాడు కాదంటూ పోలిక తెచ్చారు. దీంతో వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, ఫాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు.


వివాదాస్పద పాస్టర్‌ను రాహుల్ కలుసుకోవడం, పాస్టర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ విమర్శలు గుప్పించారు. శక్తి (హిందూ దేవతలు) తరహాలో కాకుండా జీసస్ మాత్రమే భగవంతుడు అని పాస్టర్ చెప్పడాన్ని నిలదీశారు. గతంలో ఇదే పాస్టర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యారని గుర్తుచేశారు. హిందువులను సవాలు చేసి, బెదరించిన జార్జి పొన్నయ్య ఈరోజు భారత్ జోడో యాత్ర పోస్టర్ బాయ్‌ను కలిశారని, భారత్‌మాత గురించి ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. హిందూవ్యతిరేక భావాలున్న సుదీర్ఘ చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని షెహజాద్ పూనావాలా ఓ ట్వీట్‌లో విమర్శించారు. ''భారత్ జోడో విత్ భారత్ టోడో ఐకాన్స్'' అంటూ ఎద్దేవా చేశారు.




ఎన్నికల సమయంలో రాహుల్ ఆలయాలకు వెళ్తారని, ఎన్నికల ముగియగానే మరో తరహాలో వ్యవహరిస్తుంటారని, ఆయన నిజస్వరూపం ఏమిటో జార్జి పొన్నయ్యను కలవడం ద్వారా ఇప్పుడు బయటపడిందని బీజేపీ నేత సంబిత్ పాత్ర అన్నారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని, కాంగ్రెస్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అన్నారు. 





అయితే బీజేపీ చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత, జైరామ్ రమేష్ కొట్టివేశారు. ఆడియోలో ఎవరో ఏదో మాట్లాడితే దానికి రాద్ధాంతం అవసరం లేదన్నారు. భారత్ జోడో యాత్ర విజయవంతంగా మొదలుకావడంతో బీజేపీ ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 



Updated Date - 2022-09-10T21:22:44+05:30 IST