Punjab CM Mann వివాహ వేడుక ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-07T17:42:45+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ల వివాహ వేడుక గురువారం ఉదయం ప్రారంభమైంది....

Punjab CM Mann వివాహ వేడుక ప్రారంభం

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ల వివాహ వేడుక గురువారం ఉదయం ప్రారంభమైంది. సీఎం రెండో పెళ్లి వేడుక ఫొటోను పంజాబ్ ఎంపీ రాఘవ్ చద్దా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్,డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను వివాహ వేడుకల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు పాల్గొన్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహ ఆచారాల ఫొటోను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.


ఈ కార్యక్రమంలో రాఘవ్ చద్దా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తన కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంత్‌ మాన్‌ పెళ్లిలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆయన తండ్రి పాత్రను పోషిస్తారని, ఆయన పెళ్లిలో అన్ని ఆచార వ్యవహారాలు నిర్వహిస్తారని ఎంపీ రాఘవచద్దా తెలిపారు.


Read more