ఆంధ్రజ్యోతి పేపర్‌ను పార్థివదేహంపై ఉంచాలనేది అయన చివరి కోరిక

ABN , First Publish Date - 2022-04-05T20:28:06+05:30 IST

ఆంధ్రజ్యోతి అభిమాని, రిటైర్డు ఉపాధ్యాయుడు సంపంగి రామయ్య (75) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.

ఆంధ్రజ్యోతి పేపర్‌ను పార్థివదేహంపై ఉంచాలనేది అయన చివరి కోరిక

హోసూరు (బెంగళూరు): ఆంధ్రజ్యోతి అభిమాని, తెలుగు భాషాభిమాని, తెలుగు కోసం కృషి చేసిన రిటైర్డు ఉపాధ్యాయుడు సంపంగి రామయ్య (75) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. హోసూరు నగరంలో భాషా ఉద్యమాల్లో చిన్ననాటి నుంచి చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ.. తెలుగు భాష  కోసం కృషి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన ముందుండేవారు. తమిళనాడు తెలుగు సమ్మెళనంలో ఉపకార్యదర్శిగా, ఆంధ్ర సాంస్కృతిక సమితిలో కూడా పలు హోదాలకు ఆయన న్యాయం చేకూర్చారు. ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిగా కొంత కాలం పనిచేశారు. సంపంగి రామయ్య చివరి కోరిక ప్రకారం కుటుంబసభ్యులు ఆంధ్రజ్యోతి పేపర్‌ను అయన పార్థివదేహంపై ఉంచారు. ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ ఆంధ్రజ్యోతి పేపర్ కోసం కష్టపడిన వ్యక్తి.. సంపంగి రామయ్య మృతిపట్ల ఆంధ్రజ్యోతి సిబ్బంది సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం.

Updated Date - 2022-04-05T20:28:06+05:30 IST