బంగ్లాదేశ్ నౌకపై రష్యా మిస్సైల్ దాడి...పౌరుడి మృతి

ABN , First Publish Date - 2022-03-03T12:45:07+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడికి దిగిన రష్యా గురువారం బంగ్లాదేశ్ నౌకపై క్షిపణి దాడి చేసింది....

బంగ్లాదేశ్ నౌకపై రష్యా మిస్సైల్ దాడి...పౌరుడి మృతి

ఒల్వియా: ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడికి దిగిన రష్యా గురువారం ఉక్రెయిన్ నౌకాశ్రయంలో ఉన్న బంగ్లాదేశ్ నౌకపై క్షిపణి దాడి చేసింది. ఒల్వియా నౌకాశ్రయం సమీపంలో నిలిచిన బంగ్లాదేశ్ సమృద్ధు అనే నౌకపై రష్యా క్షిపణితో దాడి చేసింది.ఈ దాడిలో బంగ్లాదేశ్ నౌకలో పనిచేస్తున్న ఆ దేశ పౌరుడు మరణించాడని ఉక్రెనియన్ మీడియా తెలిపింది.ఒల్వియా నౌకాశ్రయంలో బంగ్లాదేశ్ జెండా ఉన్నా రష్య సైనికులు మిస్సైల్ దాడి చేశారు.రష్యా కీలకమైన ఉక్రేనియన్ నగరాలపై దాడిని కొనసాగిస్తున్నాయి.కైవ్ నగరంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రష్యా వైమానిక దాడి చేసింది.కైవ్ నగరంలో రష్యా బాంబు పేలుళ్లకు పాల్పడుతోంది.కైవ్, కైవ్ ఒబ్లాస్ట్ ,మైకోలైవ్, జిటోమైర్,ఇవానో కివస్క్, ఛెర్నీహివ్, ప్రాంతాల్లో రష్యా వాయుసేన దాడులు చేస్తుండటంతో అక్కడి ప్రజలు ఖాళీ చేసి సమీపంలో షెల్టర్లలో తలదాచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది.


Updated Date - 2022-03-03T12:45:07+05:30 IST