ఖుర్బానీ కోసం జోరుగా పొట్టేళ్ల విక్రయం

ABN , First Publish Date - 2022-07-07T15:03:04+05:30 IST

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని నగరంలో బుధవారం ఉదయం నుంచి ఖుర్బానీ కోసం పొట్టేళ్ళ విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం బక్రీద్‌

ఖుర్బానీ కోసం జోరుగా పొట్టేళ్ల విక్రయం

చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని నగరంలో బుధవారం ఉదయం నుంచి ఖుర్బానీ కోసం పొట్టేళ్ళ విక్రయాలు ఊపందుకున్నాయి. ఆదివారం బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులు మేకలు, పొట్టేళ్లు, ఒంటెలను ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. ఈ మేరకు నగరంలోని పులియంతోపు, విల్లివాక్కం, సైదాపేట, అంబత్తూరు ప్రాంతాల్లోని మేకల దొడ్డి ప్రాంతాల్లో పొట్టేళ్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సుమారు 50 వేలకు పైగా మేకలు, పొట్టేళ్లను వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుంచి  నగరానికి తీసుకువచ్చారు. పులియంతోపు మేకలదొడ్డి ప్రాంతంలో 20 వేల మేకలు, పొట్టేళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. బక్రీద్‌కు నాలుగు రోజులే ఉండటంతో బుధవారం ఉదయం నుంచి మేకలు, పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 15 కేజీల బరువైన మేక ధర రూ.10,500లకు విక్రయిస్తున్నారు. ఇదే విధంగా బక్రీద్‌కు హోటళ్లలో బిర్యానీ అమ్మకాలు కూడా అధికం కానుండటంతో హోటళ్ల యజమానులు కూడా మేకలను కొనేందుకు బారులు తీరుతున్నారు.

Read more