Azadi Quest: భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాల ఆధారంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ గేమ్‌ సిరీస్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-25T23:39:18+05:30 IST

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా భారత స్వాతంత్ర్య పోరాట కథలను ఆటల రూపంలో పరిచయం చేసేందుకు ' ఆజాదీ క్వెస్ట్' (Azadi Quest) పేరిట రూపొందిన ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని

Azadi Quest: భారత స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాల ఆధారంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ గేమ్‌ సిరీస్ ప్రారంభం

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా భారత స్వాతంత్ర్య పోరాట కథలను ఆటల రూపంలో పరిచయం చేసేందుకు ' ఆజాదీ క్వెస్ట్' (Azadi Quest) పేరిట రూపొందిన ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. జింగా ఇండియా సహకారంతో  ఆన్‌లైన్ విద్యా మొబైల్ గేమ్‌ల శ్రేణిని అభివృద్ధి చేశారు.  స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని అంతగా గుర్తింపుకు నోచుకోని సమరయోధుల కథలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా మొబైల్ ఆటలు రూపొందించామని అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. భారతదేశంలో ఆన్‌లైన్  క్రీడలకున్న మార్కెట్ అవకాశాల ద్వారా ప్రయోజనం పొందడంతో పాటు ప్రజలకు ఆటల ద్వారా అవగాహనను కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించామని ఆయన చెప్పారు. కొన్నేళ్లుగా గేమింగ్ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే టాప్ 5లో నిలిచిందని ఠాకూర్ తెలిపారు. 2023 నాటికి ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుతున్న వారి సంఖ్య 45 కోట్లకు చేరుతుందని మంత్రి చెప్పారు. ఈ యాప్‌ల రూపకల్పనలో జింగా ఇండియా చేసిన కృషిని మంత్రి అభినందించారు. అన్ని వయసుల వారు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మంత్రి కోరారు. దేశ  స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన విద్యా సాధనంగా యాప్‌ మారుతుందన్నారు. 






ఆజాదీ క్వెస్ట్ సిరీస్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, దేశ స్వాతంత్ర్య సమరయోధుల ఇతిహాసాల జ్ఞానాన్ని అందిస్తుంది. గేమ్ ఆడేవారికి గతాన్ని గుర్తు చేసుకుని తమ కర్తవ్యాన్ని తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. ఆజాదీ క్వెస్ట్‌ను పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్‌తో సహా ప్రతి నెలా గేమ్‌లు ఆటగాళ్లకు ఉత్తేజకరమైన రివార్డులను అందిస్తారు.



Updated Date - 2022-08-25T23:39:18+05:30 IST