బంగ్లాదేశ్లో మరో ఆలయంపై దాడి
ABN , First Publish Date - 2022-07-18T07:45:28+05:30 IST
బంగ్లాదేశ్లో మరోమారు ఓ ఆలయం, హిందువుల ఇళ్లపై ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు.

ఢాకా, జూలై 17: బంగ్లాదేశ్లో మరోమారు ఓ ఆలయం, హిందువుల ఇళ్లపై ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నరైల్ జిల్లా ఢిగోలియా గ్రామంలో ఓ ఆలయంపై ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారని, మైనారిటీలైన హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారని పోలీసు ఇన్స్పెక్టర్ హరన్ చంద్రపాల్ శనివారం వెల్లడించారు. ఫేస్బుక్లో ఓ హిందూ బాలుడు పెట్టిన పోస్టు ఇస్లామిస్టులను ఆగ్రహానికి గురిచేసిందన్నా రు. హిందువుల కుటుంబానికి చెందిన ఓ ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారని చెప్పారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారని తెలిపారు.