జమ్మూ-కశ్మీరులో ఎన్నికలు ఇక అక్టోబరులోనే?

ABN , First Publish Date - 2022-02-19T17:35:37+05:30 IST

జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు అక్టోబరు-నవంబరుల్లో

జమ్మూ-కశ్మీరులో ఎన్నికలు ఇక అక్టోబరులోనే?

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు అక్టోబరు-నవంబరుల్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును మరో మూడు నెలలపాటు పొడిగించబోతున్నట్లు తెలుస్తోంది. శాసన సభ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించేందుకు 2020లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. నిర్ణీత గడువు మార్చిలోగా ఈ ప్రకియ పూర్తయ్యేలా కనిపించడం లేదు.


డీలిమిటేషన్ కమిషన్ తన రెండో ముసాయిదా నివేదికను ఫిబ్రవరి 5న ఐదుగురు సహచర జమ్మూ-కశ్మీరు సభ్యులకు అందజేసింది. వీరు తమ అభ్యంతరాలను సమర్పించారు. ఇక ఈ ముసాయిదాను ప్రజల ముందు ఉంచుతారు. ప్రజలు తమ సూచనలు, అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఈ కసరత్తును పూర్తి చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉంది. 


ఈ కసరత్తు మార్చినాటికి పూర్తయితే శాసన సభ ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగి ఉండేవి. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీలిమిటేషన్ కమిషన్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తే, ఎన్నికలు కూడా వాయిదా పడతాయి. బహుశా అక్టోబరు లేదా నవంబరు నెలల్లో ఎన్నికలు జరగవచ్చు. 


Read more