గెజిట్‌ విడుదలయ్యాక సవాలు చేయరాదు

ABN , First Publish Date - 2022-10-05T09:46:06+05:30 IST

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యాక దాన్ని సవాలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాలను పెంచడాన్ని

గెజిట్‌ విడుదలయ్యాక సవాలు చేయరాదు

నియోజకవర్గాల పునర్విభజనపై ‘సుప్రీం’లో అఫిడవిట్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యాక దాన్ని సవాలు చేయరాదని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాలను పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా కేంద్రం, ఈసీ ఈ మేరకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. కశ్మీరులో పునర్విభజన కమిషన్‌ ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసిందని, ఆ తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ అయ్యిందని కేంద్రం తెలిపింది. మరోవైపు కశ్మీర్‌ కేసులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం, ఈసీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కోర్టుకు ఇంకా సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 13న జరగనుంది. 

Read more