Gujarat Election 2022: ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాల, కచ్ జిల్లాకు నర్మదా జలాలు

ABN , First Publish Date - 2022-10-02T01:44:24+05:30 IST

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీల కంటే ఆరునెలలు ముందే ప్రచారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..

Gujarat Election 2022: ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాల, కచ్ జిల్లాకు నర్మదా జలాలు

కచ్: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీల కంటే ఆరునెలలు ముందే ప్రచారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరిన్ని వరుస హామీలతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధిస్తే రాష్ట్రంలోని గ్రామగ్రామానికి ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తామని, కచ్ జిల్లాలోని మారుమూల చోట్లకు కూడా నర్మదా జలాలను రప్పిస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌తో కలిసి  వచ్చిన కేజ్రీవాల్ శనివారంనానాడు కచ్‌లోని గాంధీధామ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.


ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న పేద కుటుంబాల విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారని, ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. గుజారాత్‌లో మాత్రం బీజేపీ ప్రభుత్వం కచ్‌లో ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తోందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే గుజరాత్‌లోని ప్రతి గ్రామంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ''మీ పిల్లల భవిష్యత్ కోసం ఒక్కసారి ఆప్‌కు అవకాశం ఇవ్వండి'' అని ఆయన కోరారు. గుజరాత్‌లోని 33 జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తున్నారని, ఉచిత వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-10-02T01:44:24+05:30 IST