honeytrap: ఆర్మీ జవాన్‌పై పాక్ అమ్మాయిల వలపు వల

ABN , First Publish Date - 2022-07-27T13:23:42+05:30 IST

మన భారత సైనికులపై పాకిస్థాన్ అమ్మాయిలు వలపు వల విసిరిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది...

honeytrap: ఆర్మీ జవాన్‌పై పాక్ అమ్మాయిల వలపు వల

న్యూఢిల్లీ: మన భారత సైనికుడిపై పాకిస్థాన్ అమ్మాయిలు (Pak womens) వలపు వల(honeytrap) విసిరిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది. పాక్(pak) అమ్మాయిల వలపువలలో చిక్కిన ఆర్మీ జవాన్ (Army jawan) మన సైన్యానికి చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేశారని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసుల( General of Intelligence Wing of Rajasthan Police) దర్యాప్తులో తేలింది. పాకిస్థాన్‌కు సైనిక విభాగానికి చెందిన రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై భారత ఆర్మీ జవాన్ శాంతిమాయ్ రాణా (24)ను పోలీసులు అరెస్టు(arrest) చేశారు. భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారం పొందడం కోసం పాకిస్థానీ మహిళ రాణాను హనీట్రాప్ చేసిందని దర్యాప్తులో వెల్లడైంది.దీంతో రాణాపై అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసి జవాన్‌ను అరెస్టు చేశారు.


ఆర్మీ జవాన్ పాక్ అమ్మాయిల హనీట్రాప్‌లో ఎలా చిక్కాడంటే...

శాంతిమాయ్ రాణా పశ్చిమ బెంగాల్‌లోని బాగుండా జిల్లాలోని కంచన్‌పూర్ గ్రామ నివాసి. ఇతను జైపూర్‌లోని ఆర్టరీ యూనిట్‌లో పనిచేసేవాడు.‘‘పాకిస్థానీ అమ్మాయిలు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషా భారత ఆర్మీ జవాన్‌ శాంతిమాయ్ రాణాను సోషల్ మీడియా ద్వారా సంప్రదించారు.తర్వాత ఇద్దరు మహిళలు రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు’’ అని రాజస్థాన్ పోలీసు ఇంటెలిజెన్స్ వింగ్ డైరెక్టర్ జనరల్ ఉమేష్ మిశ్రా చెప్పారు. ‘‘పాక్ ఏజెంట్లు అయిన అమ్మాయిలిద్దరూ రాణాతో వాట్సాప్‌లో మాట్లాడేవారు. ఇద్దరూ మొదట రాణాకు నమ్మకం కలిగించారు... అమ్మాయిలు ఆర్మీ జవాన్ నుంచి నిఘా సమాచారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. అందుకు ప్రతిగా రాణా ఖాతాలో కొంత డబ్బు కూడా వేశారు. రాణా ఎలా ట్రాప్ అయ్యాడనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని మిశ్రా చెప్పారు.


 ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నానని  చెప్పి పాక్ మహిళ ఎర

తాను మార్చి 2018వ సంవత్సరం నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నానని, వాట్సాప్ చాట్, వీడియో, ఆడియో మెసేజ్‌ల ద్వారా పాకిస్థాన్ మహిళా ఏజెంట్లతో చాలా కాలంగా టచ్‌లో ఉన్నానని రాణా తెలిపాడు. పాక్ మహిళ తనను తాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ నివాసి అని చెప్పిందని రాణా పేర్కొన్నారు. యూపీలో మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పనిచేశానని పాక్ మహిళ రాణాతో చెప్పింది. మరో మహిళ తన పేరు నిషా అని పెట్టుకుంది. తాను మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో పనిచేస్తున్నానని చెప్పింది.మహిళ రాణా నుంచి రహస్య పత్రాలు, ఫోటోగ్రాఫ్‌లు, విన్యాసాల వీడియోలను కోరింది. తన దురాశతో రాణా తన రెజిమెంట్ యొక్క రహస్య పత్రాలు, వ్యాయామాల వీడియోలను కూడా పంపించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


Updated Date - 2022-07-27T13:23:42+05:30 IST