అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ సీఎం అవుతారేమో!: సిసోడియా

ABN , First Publish Date - 2022-04-08T00:15:15+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో లీడర్‌షిప్‌ను మార్చాలని చూస్తోంది. కానీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఆప్‌కు అనుకూలంగా ఉంటుంది..

అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ సీఎం అవుతారేమో!: సిసోడియా

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌ ప్రజల ఆదరణను భారతీయ జనతా పార్టీ కోల్పోయిందని, అందుకే అక్కడ ముఖ్యమంత్రి మార్చనున్నారేమోనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. మరికొద్ది రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి పీఠం నుంచి జైరాం ఠాకూర్‌ను తప్పించి అనురాగ్ ఠాకూర్‌ను ఎక్కించనున్నట్లు ఆయన జోస్యం చెప్పారు.


గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిసోడియా మాట్లాడుతూ ‘‘హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో లీడర్‌షిప్‌ను మార్చాలని చూస్తోంది. కానీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఆప్‌కు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమంత్రుల ముఖాల మార్చినా బీజేపీకి ఉపయోగపడదు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి స్పందన వస్తోంది. అక్కడ ఆపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’’ అని అన్నారు.

Read more