యాంటీ బయోటిక్స్‌తో చర్మ కేన్సర్‌ మరింత తీవ్రం

ABN , First Publish Date - 2022-09-19T07:16:12+05:30 IST

యాంటీబయోటిక్స్‌ వాడకం వలన చర్మ కేన్సర్‌ మరింత తీవ్రతరమవుతుందని అమెరికాలోని ఇమోరీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది.

యాంటీ బయోటిక్స్‌తో చర్మ కేన్సర్‌ మరింత తీవ్రం

అట్లాంటా, సెప్టెంబరు 18: యాంటీబయోటిక్స్‌ వాడకం వలన చర్మ కేన్సర్‌ మరింత తీవ్రతరమవుతుందని అమెరికాలోని ఇమోరీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో తేలింది. పేగుల్లోని సూక్ష్మక్రిములకు (మైక్రోబయోమ్‌) హాని చేసే ఏ వ్యాధి లేదా ఏ చికిత్స అయినా కూడా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. ‘‘మా పరిశోధనల్లో చిట్టెలుకల గుండె, ఎముకల్లోకి బీ16-ఎఫ్‌10 మెలనోమా(చర్మ కేన్సర్‌) కణాలను ప్రవేశపెట్టాం. వాటికి అప్పటికే విస్తృతంగా యాంటీబయోటిక్స్‌ ఇచ్చాం. ఈ అధ్యయనంలో.. వాటి పేగుల్లో ఉండే సూక్ష్మక్రిములు(మైక్రోబయోమ్‌) నశించి, రోగ నిరోధక శక్తి బలహీనపడుతున్నట్లు గుర్తించాం. కేన్సర్‌కు గానీ, ఇతర వ్యాధులకు గానీ ఔషధాలను సిఫారసు చేస్తున్నప్పుడు రోగి జీర్ణకోశ పరిస్థితిని కూడా వైద్యులు దృష్టిలో పెట్టుకోవాలి. పేగుల్లో ఉండే మైక్రోబయోమ్‌కు హాని చేసే ఏ వ్యాధి లేదా ఏ చికిత్స అయినా మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తుంది. 

Read more