చైనాలో మరో వైరస్‌!

ABN , First Publish Date - 2022-08-10T06:15:39+05:30 IST

చైనా నుంచి ఉత్పన్నమైన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టన పెట్టుకుంది. తాజాగా అలాంటిదే మరో వైర్‌సను చైనా పరిశోధకులు గుర్తించారు.

చైనాలో మరో వైరస్‌!

35మందిలో గుర్తించిన పరిశోధకులు

కాలేయం, మూత్రపిండాలను దెబ్బతీసే లాంగ్యా హెనిపా వైరస్‌


బీజింగ్‌, ఆగస్టు 9: చైనా నుంచి ఉత్పన్నమైన కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టన పెట్టుకుంది. తాజాగా అలాంటిదే మరో వైర్‌సను చైనా పరిశోధకులు గుర్తించారు. దీన్ని లాంగ్యా హెనిపావైర్‌సగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని షాన్‌డోంగ్‌, హెనన్‌ ప్రావిన్సుల్లో 35 కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది సోకిన వారిలో కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయని స్పష్టం చేస్తున్నారు. తొలుత జ్వరం, నీరసం, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, వాంతులు, తలపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైర్‌సను కనుగొనేందుకు తైవాన్‌లోని రోగ నియంత్రణ కేంద్రాలు(సీడీసీ) ఒక పరీక్ష విధానాన్ని నెలకొల్పే పనిలో పడ్డాయి.


కాగా.. ఈ లాంగ్యా హెనిపావైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకినట్లు ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదని చైనా పరిశోధకులు తెలిపారు. అయితే.. అలా సోకదని కూడా చెప్పేందుకు లేదని, వైరస్‌ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. వైరస్‌ సోకిన వారిలో మరణాలేవీ సంభవించలేదని వెల్లడించారు. తాము పరీక్షించిన మొత్తం మేకల్లో 2ు, మొత్తం కుక్కల్లో 5ు లాంగ్యాహెనిపావైర్‌సకు పాజిటివ్‌ గా తేలాయని పేర్కొన్నారు.   

Read more