Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు షాక్

ABN , First Publish Date - 2022-11-12T05:24:23+05:30 IST

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు మరో షాక్ తగిలింది...

Eknath Shinde: ఉద్ధవ్ ఠాక్రేకు షాక్
MP Gajanan Kirtikar

ముంబయి: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు మరో షాక్ తగిలింది. ఠాక్రే శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడైన ఎంపీ గజానన్ కీర్తికర్ మహారాష్ట్ర(Maharastra) ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఫిరాయించారు.సీఎం షిండే, ఇతర నేతల సమక్షంలో ఎంపీ(Sena MP) కీర్తికర్ ఠాక్రే శివసేన నుంచి షిండే శిబిరంలో చేరారు.(Eknath Shindes camp) అనంతరం కీర్తికర్ ను తమ ఠాక్రే వర్గ శివసేన(Uddhav Thackeray) నుంచి బహిష్కరించినట్లు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

షిండే వర్గంలో చేరిన 13వ ఎంపీ కావడంతో కీర్తికర్ పార్టీ మారడం ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో గందరగోళాన్ని సృష్టించింది.ముంబైలో ఆరు లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో మూడు బీజేపీకి, మూడు శివసేనకు ఉన్నాయి. ముంబైలోని ముగ్గురు శివసేన ఎంపీల్లో ఇద్దరు ఇప్పటికే షిండే క్యాంపులో చేరారు. కీర్తికర్ శుక్రవారం షిండే శిబిరంలో చేరారు.శివసేనకు చెందిన లోక్‌సభ ఎంపీ అరవింద్ సావంత్ ఒక్కరే ఠాక్రే శిబిరంలో ఉన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత షిండే కీర్తికర్ ఇంటికి వెళ్లారు.శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది 18 మంది ఎంపీల్లో 12 మంది మద్దతునిస్తూ ఠాక్రే నాయకత్వంపై ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో జూన్‌లో శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ముఖ్యమంత్రి పదవికి ఠాక్రే రాజీనామా చేసిన తర్వాత,బీజేపీ మద్దతుతో షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.అప్పటి నుంచి పార్టీ పేరు, గుర్తు, పార్టీ కార్యాలయాలు, ఈ రెండిటిలో అసలు శివసేన ఏది అనే అంశంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. గత నెలలో ఎన్నికల సంఘం శివసేనలోని రెండు వర్గాలకు పేర్లను కేటాయించింది.

Updated Date - 2022-11-12T05:29:37+05:30 IST