Anna Univercity స్నాతకోత్సవానికి ప్రధాని?

ABN , First Publish Date - 2022-07-21T16:45:47+05:30 IST

అన్నా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశముందని తెలిసింది. చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి నగరానికి

Anna Univercity స్నాతకోత్సవానికి ప్రధాని?

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 20: అన్నా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశముందని తెలిసింది. చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవానికి నగరానికి విచ్చేస్తున్న ప్రధాని ఈ నెల 29న జరుగనున్న అన్నా విశ్వవిద్యాలయ 42వ స్నాతకోత్సవంలో పాల్గొనే అవకాశముందని సచివాలయ వర్గాలు తెలిపాయి. అయితే ఇది ఇంకా ఖరారు కాలేదని వివరించాయి. 

Read more